కీర్తి
(పార్ట్-1 తన పాప ని కాపాడిన ఆదిత్య )
ఒక అడవి లో బ్రిటిష్ కాలం నాటి పాత ప్యాలస్ ఉంది. ఒక రోజు రాత్రి ఆ ప్యాలస్ కి దూరంగా ఒక కార్ వచ్చి ఆగింది. ఆ కార్ లోంచి ఆదిత్య దిగితు తన భార్య ప్రియ ని కార్ లో నే ఉండమని చెప్తాడు, తాను వచ్చేంత వరకు జాగర్తగా ఉండమని చెప్పి ప్యాలస్ వైపుగా వెళ్తాడు. ఆదిత్య మెల్లగా ఎవ్వరికి తెలియకుండా ప్యాలస్ దగ్గరి కి చేరుకున్నాడు. ఆ ప్యాలస్ చుట్టూ వింత నాళ్ళని దుస్తులు ధరించినా మనుషులు ఉన్నారు. ఆదిత్య వాళ్ళెవ్వరి కంట పడకుండా ప్యాలస్ వెనుక గేట్ వరకు చేరుకున్నాడు . అక్కడ నుండి మెల్లగా ప్యాలస్ లోపలికి వెళ్ళాడు.
లోపలి కి వెళ్లిన ఆదిత్య అక్కడ జరుగుతున్నది చూసి ఆశ్చర్య పొయ్యాడు అది బయటకి మాత్రమే ఓల్డ్ ప్యాలస్ లోపల మాత్రం మోడరన్ సైన్స్ ల్యాబ్ లా ఉంది.
అక్కడ ఎన్నో రూమ్స్ ఉన్నాయ్ ఇన్ని రూమ్స్ లో తన పాపా ని ఎలా వెతకాలి ఆందోళన పడ్డాడు. చిన్నగా ఒక్కో రూమ్ చూసుకుంటూ వెళ్తున్నాడు ఆలా వెళ్తున్న ఆదిత్య కి ఒక్క రూమ్ లో చిన్న పాపలను పరిశోధన లో ఒక్క భాగంగా వాడటం చూసాడు. ఒక పాప వొంట్లో ని రక్తం తో ఏదో తయారు చేస్తున్నారని ఆదిత్య కి అర్ధమైంది. అట్టు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిన్న పిల్లల మృతదేహాలను చూసాడు. శరీరం నుండి రక్తాన్ని పూర్తిగా తీసేసినట్టు ఉన్నారు చూడటానికి చాలా భయంకరంగా ఉన్నారు . అది చుసిన ఆదిత్య కు చాలా భయం వేసింది తన పాప కి ఎం కాకూడదు అన్ని దేవుని ప్రదించాడు. ఆలా వెతుకు వెతుకుతూ ఒక రూమ్ లో చిన్న పిల్లలని చూసాడు ఊయలలో హయ్యిగా నిద్రపోతున్నారు వీరిలో తన పాపా ని ఎలా కనిపెట్టడం అన్ని ఆలోచిస్తున్నాడు. ఇంతలో ఆ ఊయలకు నోట్ప్యాడ్లు ఉండటం చూసాడు దాన్ని మీద ఆ పాప పుట్టిన టైం, డేట్, ఇంకా ప్లేస్ ఉన్నాయ్ దాని ద్వారా తన పాప ని కనిపెట్టచ్చు అన్ని అనుకున్నాడు . ఆ రూమ్లో ఉన్న ప్రతి ఒక్క ఊయల ని చూసాడు కాని ఎక్కడ తన పాప లేదు దానితో ఆదిత్య కు చాలా భయం వేసింది తన పాప కి ఏమయిందో అన్ని గుప్పెడు దుఃఖం లో మునిగిపోయాడు ఆదిత్య . ఇంతలో ఆ గది ని ఆనుకొని ఉన్న ఒక చిన్న గదిలో నుంచి ఒక చిన్న పాప ఏడుపు శబ్దం వినిపించింది. అది విన్న ఆదిత్య కు అది తన పాప ఏడుపు అయిఉండచు అన్ని ఆశ గా ఆ రూమ్ లో కి వెళ్తాడు. ఆ రూమ్ లో కేవలం ఒక పాప మాత్రమే ఉంది, ఇది తన పాపే అయ్యిఉండాలని ఆ దేవుడిని ప్రదిస్తూ ఆ ఊయల కి ఉన్న నోట్ప్యాడ్ ని చూసాడు. ఆ పాప తన పాపే, తన గురుంచే ఆదిత్య వెతుకుంటూ వచ్చింది. అదే మొద్దటి సరి ఆదిత్య తన పాప ని చూడటం . తన పాప ని చేతులోకి తీసుకున్న మరు క్షణం ఆదిత్య కళ్ళలో ఆనందం తో నీళ్లు నిండాయి .
ఇంకా ఎక్కువ సేపు ఇక్కడ ఉంటె ప్రమాదం అన్ని అనుకోని, ఆదిత్య తాను ఎలా ఐతే లోపలికి వచ్చాడో, అదే దారిలో ఎవ్వరికి తెలియకుండా తన పాప తీసుకొని వెళ్ళిపోయాడు.
ఆదిత్య మెల్లగా పాప ని తీసుకొని ప్రియ ఉన్న చోటుకు చేరుకున్నాడు. ఆదిత్య పాప ని ప్రియ కి అప్పగించి కారులో వాళ్ళ ఇద్దరిని అక్కడ నుంచి దూరంగా తీసుకువెళ్లాడు.
ఆలా వాళ్ళు, ఆ అడవిలోంచి బయటపడరు.
దారిలో వాళ్ళని ఎవ్వరు ఫాలో చేయట్లేదని కంఫర్మ్ చేసుకున్నాక ఆదిత్య మనసు కుదుటపడింది. ఆదిత్య ప్రియా కళ్ళలో పాప దొరికిందన్న ఆనందాన్ని చూస్తాడు. పాప కి ఎ పేరు పెడదాం అన్ని అడుగుతాడు దానికి ప్రియ కీర్తి అన్ని చెపుతుంది. ఆదిత్య కూడా పేరు బాగుందాన్ని అంటదు.
Super narration
ReplyDelete👌😍
ReplyDelete