కీర్తి
(పార్ట్-1.1 అజ్ఞ్యాతంలో కీర్తి ఇంకా ఆదిత్య )
అక్కడ నుండి తప్పించుకొన్ని వాళ్ళు, ఆ రాత్రి దారిలో ఒక్క ధాబా లో రెస్ట్ తీసుకున్నారు. మరుసటి రోజు ఉదయం వాళ్ళు బయలుదేరుదాం అన్నా టైం లో అక్కడికి ఒక్క మంత్రంగతే వచ్చింది. అప్పుడు ప్రియ పాప ని ముద్దాడుతుంది ఆదిత్య కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. అలా వాళ్ళని చూసిన మంత్రగతే కోపం తో రాగిలిపోతొంది. అప్పుడు ఆ మంత్రగతే ఆవేశంగా అదో మంత్ర ని ఉచ్చరించింది. ఉన్నటుండి వాతావరణం భీభత్సంగా మారింది, గాలి చాలా వేగంగా వీచింది, చుట్టు ఉన్న పక్షులు అన్ని నేలకు రాలాయి. అది చూసిన ఆదిత్య, ప్రియలకు ఒక్క క్షణం ఎం జరుగుతుందో అర్ధంకాలేదు. ఆ మంత్రగతే తన తన శక్తి తో భూమిలో నుండి కొత్త మంది మనుషులని పుట్టించింది. అలాంటి వల్లనే ఆదిత్య ఆ ప్యాలస్ కి కాపలాగా చూసాడు . అలా పుట్టినా మాయావి లు ప్రియ మీద కత్తులతో ధాడి చేయడం మొదలు పెట్టారు. ప్రియ ని కాపాడానికి ఆదిత్య పూరి చేయడం కోసం వేడి చేసిన నూనే ని వాళ్ళ మొహం మీద కొట్టి . అక్కడి కి సరుకుల లోడ్ తో వచ్చిన ట్రక్ లో వాళ్ళు తప్పించుకున్నారు. ఆదిత్య ట్రక్ ని చాలా వేగంగా నడుపుతున్నాడు. వాళ్ళ వెనుక మాయావి లు అంతే వేగంగా పరిగెత్తుకుంటూ వస్తున్నారు, వాళ్ళ వెనుక మంత్రగతే గాల్లో ఎగురుకుంటూ వస్తుంది.
మంత్రగతే తన శక్తి తో రోడ్ కి పక్కన ఉన్న బండలను, చెట్టుని దారికి అడంగ పడేసింది. దారికి అడంగ పడి ఉన్న రాళ్లను, చెట్టు ను చుసిన ఆదిత్య ట్రక్ ను రివర్స్ గేర్ లో వెనుకకి వేగంగా పోనిచ్చాడు. దారిలో ఉన్న మాయావి లు తప్పించుకోవడానికి పక్కకు ఉన్న చెట్టు మీదకు దూకారు. గాలిలో ఉన్న మంత్రగతే ట్రక్ ని ఢీ కొన్ని కింద పడిపోయింది. ఆదిత్య వెంటనే స్టీరింగ్ తిప్పి ట్రక్ ని ముందుకు పోనిచ్చాడు.
మంత్రగతే వదిలిన ఆ మాయావి లు ఇంకా వదల్లేదు. ఆ మాయావిలు ఎలాగో లాగా ట్రక్ మీదకు దూకారు. వాళ్ళు ప్రియ పైన దాడి చేయడానికి ప్రయాణిస్తున్నారు. ఇంతలో ఒక్క మాయావి దారిలో ఓ పెద్ద కొమ్మ గట్టిగ తగలడం వల్ల భూడిదగా మారిపోయాడు. అది గమనించిన ఆదిత్య ట్రక్ ని చెట్టులు ఎక్కువగా ఉన్న అడవి మార్గం లో ట్రక్ ని పోనిచ్చాడు. మాయావి లు ఆ చెట్ల కొమ్మాలకి తక్కి బూడిద అవ్వుతున్నారు. ట్రక్ వేగంగా వెళ్లడం వల్ల ట్రక్ కంట్రోల్ తప్పి ఒక్క పేద్ద చెట్టు ను గుద్దుకుంది అలా గుద్దుకోవడం వల్ల మిగిలిన మాయావిలు అందరు భూడిదగా మారారు.
చెట్టుకు గుద్దుకోవడం వల్ల ఆదిత్య కు చిన్న గాయాలు అయ్యాయి, ఒక్క మాయావి తన ఆఖరి క్షణం లో ప్రియ ని కత్తి తో కడుపు లో పొడిచాడు. ఆదిత్య ప్రియ కడుపు లో నుండి కారుతున్న రక్తాన్ని చూసాడు. అది చూసి ఆదిత్య చాలా కంగారుపడదు. ప్రియ కూడా తన చేతులకి అంటిన రక్తాన్ని చూసి కంగారు పడింది. కాని ఆ రక్తం పాపది కాదు తనది అన్ని తెలుసుకున్నాక తన మనసు కుదుటపడింది. ఆదిత్య తన భార్య ని ఎలాగైనా కాపాడుకోవాలని ఆ ట్రక్ దిగి తనని అక్కడ నుండి తీసుక వెళ్లే ప్రయత్నం చేసాడు. కాని ప్రియ నడిచే పరిస్థితిలో లేదు తాను అడుగు తీసి అడుగు వేయలేక పోతుంది. తాను ఎంత ప్రయత్నించినా తన వల్ల కావడం లేదు. రక్తం ఎక్కువగా పోతుందని ఆదిత్య తన షర్ట్ తీసి ప్రియ నడుము కట్టాడు. అప్పుడే అటు గా వస్తున్నా మంత్రగతేను చుసిన ప్రియ తన పాప ని చివరి సరిగా చూసుకొని ఆదిత్య కు పాప ని అప్పగించి అక్కడ నుండి వెళ్లిపొమ్మని చెప్పింది. ఆదిత్య ప్రియ ని కూడా తన తో రమన్ని చెప్పాడు. దానికి ససేమీరా ఒప్పుకోలేదు, తన వల్ల కాదని ఆదిత్య ను ఒపించి అక్కడనుండి పంపించింది.
మంత్రగతే అక్కడికి చేరుకునే సరికి ట్రక్ పక్కన రక్తం తో తడిసిన ప్రియ ఒక్కతే ఉంది. మంత్రగతే ట్రక్ లో పాప గురుంచి వెతికింది అక్కడ లెక్కపోవడం తనని వెతుకుంటు వెళ్లబోతుంటే ప్రియ మంత్రగతే దారికి అడ్డం వచ్చింది. మంత్రగతే కోపం తో ప్రియ ని తన శక్తి తో గాల్లో కి లేపింది. ప్రియ భూమికి 10అడుగుల మీద ఉంది ప్రియ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది కాని తన వల్ల కావడం లేదు. మంత్రగతే అదే శక్తి తో ప్రియ గొంతు పిసుకుతుంది. ప్రియ దాన్ని వీడిపించుకోలేక పోతుంది అప్పుడే ఆదిత్య వెనుక నుండి వచ్చి మంత్రగతే తల మీద కర్ర తో గట్టిగ కొట్టాడు. మంత్రగతే తల పగిలి రక్తం కారుతుంది. మంత్రగతే ఆదిత్య ని చూస్తూ చిన్న నవ్వి ప్రియ మేడ పూర్తిగా వీరిచి కింద పడేసింది. అది చుసిన ఆదిత్య భాధ తో గట్టిగ అరుస్తూ మారో సారి తల మీద గట్టిగ కొట్టాడు. మంత్రగతే అక్కడే పడిపోయింది.
ఆదిత్య ఏడుస్తూ ప్రియ దగ్గరికి వెళ్ళాడు. ఆదిత్య ప్రియ తల ని ఒడిలో పెట్టుకొని. తన తో గడిపిన మధుర క్షణాలు గుర్తుచేసుకుంటూ బొర్రుమని ఏడిచాడు.
అప్పుడే ఆదిత్య కు ప్రియ ఎప్పుడు చెప్పే కోరిక ఒక్కటి తన కళ్ల ముందు కదలాడింది. అదేంటంటే ప్రియ కి ఊటీ లో ఒక్క కొండ పైన పెద్ద ఇల్లు కట్టుకోవాలి, ఆ ఇంటి చుట్టూ పచ్చని చెట్లు, పక్షులు, ప్రకృతి మాత్రమే ఉండాలి. అక్కడ చుట్టూ పక్కల వేరే ఇల్లు ఎం ఉండకూడదని . అక్కడ ఉండే చల్లని గాలిని, ప్రకృతి అందని ఆస్వాదిస్తూ ప్రశాంతంగా, హాయి గా, భ్రాతకాలి అన్ని అంటుండేది. ఆదిత్య ప్రియ కోరిక మేరకు ఊటీ వెళ్ళాలి అన్ని నిశ్చయించుకొని తన పాప ని తీసుకొని ఊటీ కి వెళ్ళిపోయాడు
No comments:
Post a Comment