Sunday, August 11, 2019

Keerthi Telugu story part 1.5

కీర్తి  
(పార్ట్-1.5 వీరేంద్ర  )

   వీరేంద్ర ది గ్రేట్ genetic scientist, genetic శాస్త్రం లో అతని  అంత గొప్ప వాడు లేడు. దాదాపు 30  సంవత్సరాల తారువాత  కోమా నుండి బయటకి వచ్చాడు. 30 సంవత్సరాల క్రితం తాను చేసిన పరిశోధన వల్ల తాను  తన జీవితం లో సగం నిద్ర లోనే గడిపాడు  ఇంకా  తన  కాళ్ళు రెండు చచ్చుబడిపోయాయి. ఎంత టెక్నాలజీ పెరిగిన చచ్చుబడిన వీరేంద్ర రెండు కాళ్ళని మళ్ళి మాములుగా చేయలేక పోయారు. ఈ విషయాన్ని వీరేంద్ర అసలు జీర్ణించు లేకపోయాడు. ఎలాగైనా సరే తాను కొలిపోయిన యవ్వనని, రెండు కాళ్ళను మల్లి పొందాలని నిర్ణయించుకున్నాడు. అది తన ఒక్కడి వల్లే జరుగుతుందని అతనికి తెలుసు దాని కోసం మూత పడి ఉన్న తన ల్యాబ్ ని మళ్ళి  ప్రారంభించి పరిశోధనలు ప్రారంభించాడు. 
తన పరిశోధనకు 10 నుండి 16 వయసులో గల్ల పిల్లల అవసరం పడింది దాని కోసం సిటీ లో ఉండే లేబర్ పని చేసే పిల్లల్ని, రోడ్ మీద చెత్త ఏరుకునే వాళ్ళని, పేద పిల్లల్ని ఎత్తుకు వచ్చి వాళ్ళ మీద పరిశోధనలు చేస్తున్నాడు 7నెల్లు గడిచాయి కాని తాను అనుకున్నది మాత్రం చేయలేకపోయాడు. 
అలా క్రమంగా సిటీ లో పేద పిల్లల కిడ్నప్ లు ఎక్కువ అవ్వడం తో "జనం కోసం " అనే వార్త పత్రిక లో జర్నలిస్ట్ గా పని చేసే శ్రీనాథ్ ఈ క్రైమ్ వెనుక ఎవ్వరు ఉన్నారని ఇన్వెస్టిగేషన్ మొద్దలు పెట్టాడు. అలా తన ఇన్వెస్టిగేషన్ లో భాగంగా  ఓల్డ్ సిటీ కి చెందిన షైక్ ఇమ్రాన్ అన్నే వ్యక్తికి పెద్ద మొత్తం డబ్బు రాబోతుందని అతనికి ఈ పిల్లలకి ఏదైనా  సంబంధం ఉండచ్చని అతని ఫాలో అవ్వుతున్నాడు. అలా ఫాలో అవ్వుతు బస్సు స్టాప్ లో అనుకోకుండా కీర్తి కి డాష్ ఇచ్చాడు. కీర్తి శ్రీనాథ్ ని  చూసింది శ్రీనాథ్ ప్రవర్తన అనుమానాస్పదంగా  ఉండడం వల్ల పక్కనే ఉన్న  పోలీస్ కి పట్టించింది. పోలీస్ లు శ్రీనాథ్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లారు దాని వల్ల షైక్ ఇమ్రాన్ మిస్ అయ్యాడు. 
శ్రీనాథ్ స్టేషన్ లో పోలీస్ లకు జరిగిందంతా చెప్పాడు పోలీస్ శ్రీనాథ్ ని వదిలి పెట్టారు. ఈ విషయాలని కీర్తి స్టేషన్ బయట నుంచి వింది తాను చేసిన తప్పు కు గిల్టీ గా ఫీల్ అయింది తన తప్పు ను సరి దిద్దు కోవాలనుకుంది. తనని కలిసి సారీ చెపింది  జరిగిందంతా తెలుసుకుంది. అది విన్న తరువాత కీర్తి కి తన జీవితం లో జరిగిన సంఘటన లా అనిపించింది. ఆ పిల్లల కోసం కీర్తి శ్రీనాథ్ కి సహాయంగా తన తో పాటు కేసు మీద వర్క్ చేస్తా అన్ని అంది  దానికి శ్రీనాథ్ అసలు ఒప్పుకోలేదు. కీర్తి శ్రీనాథ్ ఎంత చేపిన వినలేదు శ్రీనాథ్ తనని భయపెట్టాడు, బెదిరించాడు, ప్రాధేయపడడు కాని కీర్తి మాత్రం వదలేదు ఆఖరికి కీర్తి ఆలోచనని మార్చడానికి చాలా ట్రై చేసాడు అది కుదర్లేదు. శ్రీనాథ్ కీర్తి తీసుకున్న నిర్ణయాని చూసి ముందు భయపడ కీర్తి లోని పట్టుదల శ్రీనాథ్ ని ఒప్పుకునేలా చేసింది.
కీర్తి ఆ కిడ్నప్పేర్ ని ఎలా ఐన పట్టుకోవాలి అని అనుకుంది. శ్రీనాథ్ కి తోడు గా వెళ్ళేది. కీర్తి తన కి ఉన్న పవర్స్ ద్వారా దొంగలని పట్టుకునేది. శ్రీనాథ్ కీర్తి ని చూస్తే ఆశ్చర్యం వేసేది. ఒక్కసారి ఫీల్డ్ వర్క్ లో శ్రీనాథ్ ప్రాణాలు పోయే సిట్యుయేషన్ వచ్చింది అప్పుడు కీర్తి వచ్చి శ్రీనాథ్ ప్రాణాలను కాపాడింది, శ్రీనాథ్ ఇంకా కీర్తి  మంచి ఫ్రెండ్స్ అయ్యారు. శ్రీనాథ్ కీర్తి ని తన  చెల్లి గా భావించేవాడు నిజానికి తన సొంత చెల్లి గా చూసుకునే వాడు

Monday, July 29, 2019

Keerthi Telugu story part 1.4

కీర్తి 
(పార్ట్-1.4 స్నేహం )


కీర్తి వచ్చిన కొన్ని రోజులోనే  రాజేష్ వాళ్ళ ఫ్యామిలీ లో ఒక మెంబర్ గా అయింది. పల్లవి కూడా కీర్తి ని స్పందన తో సమానంగా చూసేది. కాని స్పందన మాత్రం కొన్ని విషయలో కీర్తి పైన అనుమానం ఉండేది. కీర్తి రోజు సాయంత్రం డాబా మీద పక్షులతో మాట్లాడం, అవి కూడా కీర్తి చెప్పినట్టు వినడం ఇంకా మళ్ళి ఇంట్లోని వస్తువులు ఒక చొట్టు నుండి ఇంకో చోటు కు మాయం అవ్వడం జరిగేది , ఇంకా కీర్తి చెప్పిన టైం లోనే వర్షం పడటం , ఎండ రావడం , చల్లి పెరగడం లాంటివి జరిగేది. ఇలాంటి వింతలు అన్ని చూసి కీర్తి మీద చిన్నపాటి అనుమానం ఉండేది. అప్పట్నుంచి కీర్తి ని బాగా క్లోజ్ గా observe చేయడం మొద్దలు పెట్టింది, ఈ విషయం కీర్తి కి తెలుసు, కాని పెద్దగా పట్టించుకోలేదు. ఒక రోజు కీర్తి అలవాటు ప్రకారం మార్నింగ్ జొగ్గింగ్  కి వెళ్ళింది. స్పందన కూడా కీర్తిని ఫాలో చేసుకుంటూ తన వెనుకాలే వెళ్ళింది. పార్క్ లో కీర్తి ని ఒక పోకిరి వెధవ ఫాలో చేస్తూ ఏడిపిస్తున్నాడు. ఇదంతా స్పందన దూరం నుంచి చూస్తుంది. కీర్తి ఆ పోకిరి వెధవ మాటలను పట్టించుకోకుండా ఉంది. దాని అలుసు గా తీసుకొని పోరికి వెధవ అసభ్యకరమైన మాటలు మాట్లాడం మొడ్డలుపెట్టాడు. అవి విన్న స్పందన కోపం ఊగిపోతోంది కీర్తి మాత్రం కామ్ గా అలానే నిలుచుంది. తాను ఎం అన్నాక పోవడం ఆ పోకిరి వెధవ కీర్తి మీద చేయి వేయబోయాడు అది చూసిన స్పందన తట్టుకోలేక రంగం లో కి దిగ్గూదామని వస్తుంటే అప్పుడు తన కళ్ళతో చూసిన నిజం తనని ఆశ్చర్యానికి గురి చేసింది. 
కీర్తి ఆ పోకిరి వెధవ చేయి వేయబోతుంటే కోపం చూసింది. ఉన్నట్టు ఉండి వాడు భాధ తో గట్టిగ అరవడం మొద్దలు పెట్టాడు. ఒక్కసారిగా మోకాళ్ల కింద పడి తన రెండు చేతులతో తల ని పట్టుకున్నాడు కీర్తి మాత్రం వాణ్ని అలానే కోపంగా చూస్తుంది. వాడి మెడ నుంచి నరాలు బయటికి వస్తున్నాయి ఆ నరాలు మెడ మీద నుంచి తల వరకు బయటికి వచ్చాయి. ఆ నరాలు మెల్లగా ఉబ్బడం మొదలెట్టాయి, ఆ నొప్పి ని వాడు బరించలేక ఏడుస్తున్నాడు. కీర్తిని  వాడి నుంచి కాపాడదాం అని వస్తున్న స్పందన ఇదంతా చూసి కీర్తి దగ్గరికి వెళ్ళింది కీర్తి మాత్రం వాణ్ని  కోపంగానే చూస్తుంది స్పందన కీర్తి ని చచ్చిపోతాడు ఇక్క  చాలు  అన్నింది కానీ తాను ఎంతకీ పాటించుకోవడం లేదు  కీర్తి అని గట్టిగ అరిచింది కీర్తి వెంటనే స్పృహ లో కి వచ్చింది ఆ పోకిరి వెధవ అక్కడే స్పృహ తప్పి కింద పడిపోయాడు. 
స్పందన అంబులెన్సు కి కాల్ చేసి అతని హాస్పిటల్ కి పంపింది. తరువాత కీర్తిని ఇంటికి తీసుకు వెళ్ళింది. కీర్తి స్పందనకి  తన గురుంచి అని విషయాలు చెప్పింది. అంత విన్న స్పందన "అంటే ఇప్పుడు ని మెడలో ఉన్న చైన్ వల్ల ని శక్తులు అని కంట్రోల్ ఉంటాయి ఆ చైన్ లేదంటే ఇవ్వాళా ఆ పరిస్థితి లో ఎవ్వరు ఉన్న చనిపోయేవాళ్లు " దానికి కీర్తి అవును అన్నట్టు తల ఊపింది  . అది విన్న స్పందన అసలు నమ్మలేకపోయింది. తనని నమ్మించడం కోసం వాళ్ళ ఉన్న రూమ్ లో ఉన్న వస్తువులను స్పందన చూస్తుండగానే  గాలిలో లో కి లేపింది. అది చూసి స్పందన ఆశ్చర్య పోయింది. కీర్తి స్పందన ని ఈ విషయం ఎవ్వరికి చెప్పదు అని ఒట్టు ఏయించుకుంది. స్పందన ఈ విషయం ఇంకా ఎవ్వరికి తెలుసనీ అడిగితే రాజేష్ కి తెలుసని చెప్పుతుంది 
ఒక రోజు కీర్తి ఇంకా స్పందన కాఫీ షాప్ లో కాఫీ తాగుతుంటారు ఇంతలో కీర్తికి ఎవ్వరో అరుస్తున్నా అరుపులు వినిపిస్తాయి. స్పందన ఎం జరిగింది అని అడుగుతుంది అప్పుడు కీర్తి "ఈ కాఫీ షాప్ వెనుక ఎవ్వరో కొంత మంది ఒక్కరిని బాగా కొడుతున్నారు అంటుంది". ఇద్దరు కలిసి కాఫీ షాప్ వెనుక నుండి చాటుగా వాళ్ళని చూస్తున్నారు అక్కడ ఓ నాలుగురు గుండాలు ఒక్కడిని బాగా కొడుతున్నారు కీర్తి కి అతని ని చూసి జాలి వేసింది అతని కాపాడుదామని. అక్కడ పక్కనే ఉన్న వీధి కుక్కలని గుండాల మీదకు పంపింది. అవి ఒక్కసారి మీదకి రావడం వల్ల  అందరు అక్కడ నుండి పారిపోయారు అతను ఆ గుండాల నుంచి తపించుకున్నాడు. స్పందన కి  కీర్తి లో ని సహాయ గుణం బాగా నచ్చింది లైఫ్ లో ఎప్పుడు కీర్తికి తోడు గా ఒక మంచి ఫ్రెండ్ గా ఉండాలని నిశ్చయించుకుంది. అప్పట్నుంచి ఇద్దరు మంచి ప్రాణ స్నేహితులు అయ్యారు.

Thursday, July 18, 2019

keerthi telugu story part 1.3

కీర్తి 

(మరల  పొందిన  అమ్మ ప్రేమ Part-1.3)

హైదరాబాద్ లో కీర్తి ని ఆదిత్య తన బిజినెస్ పార్టనర్ ఇంకా ప్రాణ స్నేహితుడైన రాజేష్ దగ్గరికి పంపాడు. రాజేష్ వాళ్ళది చిన్న కుటుంబం చింత లేని కుటుంబం. రాజేష్ భార్య పేరు పల్లవి వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఒక పాప ఇంకా బాబు. అమ్మాయి  పేరు స్పందన వయసు 20 సంవత్సరాలు, చాలా ప్రాక్టికల్ ప్రతి ఒక డెసిషన్ చాలా అలోచించి  తీసుకుంటది తనకి మనుషుల కంటే జంతువులంటేనే ఎక్కువ ఇష్టం , బాబు పేరు సందీప్ వయసు 18 సంవత్సరాలు తనకి ఫుడ్ అన్న ఎద్దురింట్లో ఉండే అంకిత అన్న చాలా ఇష్టం తన లైఫ్ ఏదైనా పెద్ద అడ్వెంచర్ చెయ్యాలనేది సందీప్ కోరిక. ఇక్క పోతే పల్లవి సాధారణ తెలుగు మహిళా లా సీరియల్ అంటే పిచ్చి, అందులో క్యారెక్టర్ కి వచ్చే కష్టాలు తన కష్టాల భాధా పడుతుంది. తనకి ముందు సీరియల్ తరువాత పిల్లలు అతరువాతే మొగుడు. ఇక మిగిలింది రాజేష్ ఆదిత్య కి ఉన్న ఏకైక ప్రాణ స్నేహితుడు అతడు. రాజేష్ కి ఆదిత్య జీవితం లో జరిగిన ప్రతి ఒక విషయం తనకి తెలుసు ఆదిత్య ప్రియల లవ్ స్టోరీ నుంచి కీర్తి కి ఉన్న సూపర్ మ్యాజికల్ పవర్స్  వరకు అన్ని తెలుసు. ఆదిత్య ప్రతి ఒక విషయం రాజేష్ కి చెప్పేవాడు రాజేష్ ఎప్పుడు ఆ నమ్మకాన్ని వొమ్ము చేసెవాడు కాదు. 
         రాజేష్ కీర్తిని తన తో పాటు తన ఇంటికి తీసుకు వెళ్ళాడు. ఆ ఇంట్లో రాజేష్ కి తప్ప కీర్తి కి సూపర్ మ్యాజికల్ పవర్స్ ఉన్న విషయం ఎవ్వరికి తెలియదు. అందుకని కీర్తిని కాస్త జాగర్తగా ఉండమని సలహా ఇచ్చాడు . రాజేష్ కీర్తికి  ఇంట్లో వాళ్లందరిని  పరిచయం చేసాడు. కీర్తిని రాజేష్ తన రూమ్ కి తీసుకువెళ్లాడు అ రూమ్ లో కీర్తి గోడల మీద వాళ్ళ అమ్మ నాన్న లా ఫోటోలు ఉండడం చూసింది. అలా ఆ ఫోటో వైపు అడుగులు వేస్తూ ఆ ఫొటోలో అందంగా నవ్వుతున్న తన తల్లిని చూస్తూ కళ్లలో నీళ్లు తిరిగాయి. అప్పుడు రాజేష్ "ఈ  ఇంట్లో  ఒక్కప్పుడు మీ అమ్మ నాన్నలు ఉండే వారు ఈ రూమ్ వాళ్లదే, మీ నాన్న ఊరు వదలి వెళ్ళినప్పట్నుంచి మేము ఇక్కడే ఉంటున్నాం. కాని ఈ రోమ్ లో ఉండే జ్ఞపకాలను అలానే ఉంచాం నాకు తెలుసు ఏదో ఒక రోజు మీ నాన్నమళ్ళి ఇక్కడికి వస్తాడని, ఇవ్వాళా నువ్వు వచ్చావ్ వాడు కూడా వస్తాడు అన్నా నమ్మకం నాకు ఉంది , సరే జర్నీ చేసి అలసి పోయి ఉంటావ్ ఫ్రెష్ అయ్యి రా భోజనం చేదువు."
కీర్తి ఆ రూమ్ లో ఉండే వస్తువులన్నీ పరిశీలిస్తుంది. తనకి ఆ రూమ్ లో ని కప్బోర్డు లో వాళ్ళ అమ్మ తన కోసం కుట్టిన చిన్నప్పటి గౌను దొరికింది. ఆ గౌనును చేతిలోకి తీసుకొని చాలా భాధ పడింది ఆ గౌను పక్కనే ఆదిత్య బట్టలు ఇంకా ప్రియ బట్టలు ఉన్నాయి. ప్రియ వాళ్ళ అమ్మ చీరను తీసుకొని తన  గుండెలకు గట్టిగ ఆదుకుంది. 
అందరు డైనింగ్ టేబుల్ దగ్గర కీర్తి కోసం వెయిట్ చేస్తున్నారు. కీర్తి వాళ్ళ అమ్మ డ్రెస్ లో డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది అది చుసిన రాజేష్ కీర్తి ని " నువ్వు మీ అమ్మ కి మళ్ళి  ప్రాణం పోసావ్" అని అన్నాడు .  పల్లవి కీర్తి ని అర్ధం చేసుకుంది " నువ్వు మీ అమ్మ చాలా మిస్ అవ్వుతున్నావ్ కదా ". అని అడిగింది, కీర్తి తల ఉపుతు అవును అన్నట్టు సమధానం ఇచ్చింది. పల్లవి "ఈ ఏజ్ నువ్వు మీ అమ్మ ను ఎంత మిస్ అవ్వుతున్నావో ఇక్కడ  నాకు మాత్రమే తెలుసు ఎందుకంటే మా అమ్మకూడా  నేను పుట్టిన మరుక్షణం చనిపోయింది. నీకు ఎప్పుడు మీ అమ్మ ను మిస్ అవ్వుతున్నట్టు అనిపించిన నా  దగ్గరికి రా నేను మీ అమ్మ కాలేను కాని  అమ్మ ప్రేమను మాత్రం పంచగలను" ఆ మాటలను విన్న కీర్తి వెంటనే లేచి పల్లవిని గట్టిగ కౌగిలించుకొని ఏడిచింది. పల్లవి, రాజేష్ , స్పందన ఏడుస్తున్న కీర్తిని ఓదార్చారు . పల్లవి కీర్తికి ఇష్టమని పాయసం చేసింది తనకి తినిపిద్దామని చూస్తే సందీప్ ఒక్కడే ఆ మొత్తం పాయసాన్ని తాగేస్తున్నాడు. అందరు కన్నురెప్పలు అప్పకుండా సందీప్ నే చూస్తున్నారు. సందీప్ వాళ్ళు అలా చూస్తుంటే తట్టుకోలేక పోయాడు సందీప్ " smell చాలా tasty గా ఉంది టేస్ట్ ఎట్లా ఉంటదని కొంచెం తాగ, తాగక బౌల్ కాళి అయింది" అది విని కీర్తి నవ్వింది తాను నవ్వడం చూసి అందరు నవ్వారు. ఆ తరువాత అందరు కలిసి భోజనం చేసారు.

Wednesday, July 3, 2019

keerthi telugu story part 1.2


కీర్తి  

 ( పార్ట్ 1.2 కీర్తి హైదరాబాద్ కు ప్రయాణం  )

అలా ఊటీ కి వచ్చిన ఆదిత్య, తన భార్య కోరుకున్నవిదంగా జీవిస్తున్నాడు.తల్లి ప్రేమ కు దూరమైన కీర్తి ని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. అన్ని తానై అట్టు అమ్మ ప్రేమను ఇటు తండ్రి ప్రేమను పంచుతు కీర్తికి తల్లి లేని లోటు రానివ్వకుండా పెంచుతున్నాడు. కీర్తికి 5ఏళ్ళ వయసు అప్పుడు ఓ విచిత్రం జరిగింది తాను పక్షులతోను ముగ్గ జీవాలతోను మాట్లాడం మొదలు పెట్టింది. తాను అలా  వాటితో మాట్లడుతుంటే అది తను  ఆడుకునే అట లో భాగం కావచ్చు  అన్ని భావించేవాడు, కాని కొన్ని సార్లు ఆ జంతువులు, పక్షులు కీర్తి చేపిన విదంగా నడుచుకోవడం చూసి ఆదిత్య కి  అనుమానం కలిగేది. ఆ అనుమానం దృడపడానికి ఎంతో కాలం పట్టలేదు. కీర్తి కి 7ఏళ్ళ వయసు అప్పుడు ఇంకో వింత జరిగింది. కీర్తి ఒక్క రోజు అల్మరా  మీద ఉన్న తన బొమ్మ ను తీసుకునే ప్రయత్నం  చేస్తుంది  కాని అది  ఎంత కి అందక పోవడం తో విసిగి పోయి కోపం తో అటక మీద ఉన్న బొమ్మ వైపు చూస్తూ చేయి చప్పింది, బొమ్మ నేరుగా వచ్చి  కీర్తి చేతులోకి వచ్చింది . అది చూసిన ఆదిత్య తన అనుమానం నిజమే అన్ని నమ్మాడు. దీని అంతటికి కారణం కీర్తి మీద ఆ మంత్రగతే జరిపిన పరిశోధనే  అని అనుకున్నాడు. కీర్తి వయసు తో పాటు తన లోని శక్తులు పెరుగుకుంటూ వచ్చాయి. దూరం లో ఎవ్వరు ఎం మాట్లాడిన విన్నగలదు, ఎలాంటి వస్తువునైనా కూర్చున్న చోటు నుండే దాన్ని అదుపు చేయగలదు, పక్షులు జంతువులతో పాటు గాలి, నిప్పు, నీరు ను కూడా అదుపు చేయగలదు. 
ఆదిత్య కి కీర్తి లో ఉన్న శక్తుల ని చూసి భయం వేసెది. ఎవ్వరైనా తమ స్వార్థం  కోసం కీర్తి శక్తులని దూర్వినియోగం చేయగలరని భావించి కీర్తి కి  13ఏళ్ళ వయసు అప్పుడు చదువుమనిపించి ఇంట్లో నుండే  చదివిపించేవాడు. అలా కీర్తి ని బయట ప్రపంచానికి తెలియకుండా పెంచాడు. ఎప్పుడు ఇంట్లో ఒక్కతే ఉండే కీర్తి  జంతువులతోను పక్షులతోను కాలక్షేపం చేసేది. కీర్తి ఆదిత్య కి తెలియకుండా రాత్రి పుట ఊర్లోకి వెళ్ళేది.  అక్కడ జరిగే ఉత్సవాలు పండుగలు దగ్గర ఉండి చూసి వచ్చేది. 
క్రమంగా తన లో పెరుగుతున్న శక్తులను కీర్తి అదుపు చేయలేక పొయ్యేది. తన శక్తులు అదుపు తప్పినప్పుడలా తాను గాయపడం ఓ లేదా తన వల్ల ఎదుటి వారు గాయపడడం ఓ జరిగేది. తాను గాయపడిన పర్లేదు కాని ఎదుటి వారికీ తన వల్ల గాయం అయితే తట్టుకోలేని మనస్తత్వం కీర్తిది. ఒక్కసారి తన శక్తులు అదుపు తప్పడం వల్ల ఆదిత్య తల కు గాయం అయ్యింది. అది చూసి కీర్తి చాల బాధపడింది. కీర్తి తన శక్తులను అదుపు లో పెట్టలేక పోవ్వడానికి గురుంచి ఆలోచించింది. తనలో అంత  బలం లెక్కపోవడమే కారణం అని అనుకోని యోగ, exercise చెయ్యడం మొదలు పెట్టింది. తను బలంగా అయితే అయింది కాని తన శక్తులను మాత్రం కంట్రోల్ చేయలేక పోతుంది. అలా సంవత్సరాలు గడిచాయి కీర్తి ఇప్పుడు 21 సంవత్సరాలు. కీర్తి అచ్చం చనిపోయిన వాళ్ళ అమ్మ లాగా ఉంది. కీర్తి కి అల్లరి కూడా ఎక్కువ అయింది. తన మాయలు మంత్రాలతో  ఇంటికి వచ్చిన వాళ్ళని భయపెట్టడం లాంటివి చేసిది.   తను ఎంత అల్లరి చేసిన ఒక్క మాట కూడా అనే వాడు కాదు.
ఒక రోజు అడవిలో పావురని పట్టుకునే ప్రయత్నం లో దాన్ని వెనుకనే వెతుకుంటూ వెళ్ళింది. అది ఎంత ప్రయత్నించా దొరకక పోవడం తో తన మంత్రం శక్తితో దాన్ని  పట్టుకుందామని అన్ని అనుకుంది. పావురం తన నుండి తపించుకునేందుకు గాల్లో వేగంగా ఎగ్గురుకుంటూ పోతుంది. కీర్తి తన శక్తితో ఆ  పావురాని పట్టుకునే ప్రయత్నం చేసింది, కాని తన శక్తులు ఎం పని చేయడం లేదు. తనకు  ఆశ్చర్యం వేసింది తన శక్తులు ఎందుకు పని చేయడం లేదని  ఆలోచించింది అలా ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ ముందుకు వెళ్ళింది అలా నాలుగు అడుగులు వేసిన తరువాత శక్తులు మళ్ళి తనకి తిరిగి వచ్చాయి. ఇలా ఎందుకు జరిగిందని ఆలోచించింది. అప్పుడు తను ఇంతకు ముందు నిల్చున్న చెట్టు దగ్గరికి వెళ్ళి చూసింది  అక్కడ తన శక్తులు ఎం పని చేయలేదు ఆ చెట్టు నుండి దూరంగా వచినప్పుడు మళ్ళి తన  శక్తులు పని చేస్తున్నాయ్. ఆ చెట్టు తన శక్తులను కంట్రోల్ చేస్తుందని తనకి అర్ధమైంది. ఆ చెట్టు నుండి కొన్ని లేత ఆకులను తెంపుకొన్ని ఇంటికి వెళ్ళింది . 
కీర్తికి ఎప్పట్నుంచో ఆ ఇంటిని ఆ ఊరు ని వదిలి పెట్టి బయటకి వెళ్ళాలి అన్ని ఉండేది. ఆదిత్య దానికి మొద్దట్లో ఒప్పుకునేవాడు కాదు, తర్వాత ఒక కండిషన్ పెట్టాడు అది ఏంటంటే తన శక్తులను కంట్రోల్ చేస్తేనే నువ్వు వెళ్ళచ్చని అన్నాడు. 
కీర్తి ఇంటికి వాళ్ళకా ఆ ఆకూ తో ఒక లాకెట్ తయారు చేసుకుంది ఆ లాకెట్ ని ఒక చైన్ తో పాటు తన మేడలో వేసుకుంది. ఇప్పుడు తన శక్తులని తాను అనుకున విదంగా కంట్రోల్ చేయగలుగుతుంది. ఈ విషయం ఆదిత్య కు చెప్పింది. ఆదిత్య కు విషయం మొత్తం అర్ధం అయింది ఆదిత్య కు పంపడం ఇష్టం లేకున్నా కీర్తి సంతోషం కోసం ఒప్పుకున్నాడు. 
ఆదిత్య కీర్తి ని హైదరాబాద్ లో ఉండే తన ప్రాణ స్నేహితుడు  ఇంకా తన బిజినెస్ partner ఐన రాజేష్ దగ్గరికి పంపాలని నిశయించుకున్నాడు. కీర్తి ఎన్నో ఏళ్ల నుండి ఇలాంటి రోజు కోసం ఎదురు చూస్తుంది  తాను అనుకున్నది జరగడం వల్ల  చాలా ఆనందంగా ఉంది.

Friday, June 28, 2019

keerthi telugu story part-1.1

  కీర్తి 

 (పార్ట్-1.1 అజ్ఞ్యాతంలో కీర్తి ఇంకా ఆదిత్య )


అక్కడ నుండి తప్పించుకొన్ని వాళ్ళు, ఆ రాత్రి దారిలో ఒక్క ధాబా లో రెస్ట్ తీసుకున్నారు. మరుసటి రోజు ఉదయం వాళ్ళు బయలుదేరుదాం అన్నా టైం లో అక్కడికి  ఒక్క మంత్రంగతే వచ్చింది. అప్పుడు ప్రియ  పాప ని ముద్దాడుతుంది ఆదిత్య కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. అలా వాళ్ళని చూసిన మంత్రగతే కోపం తో రాగిలిపోతొంది. అప్పుడు ఆ మంత్రగతే ఆవేశంగా అదో  మంత్ర ని ఉచ్చరించింది. ఉన్నటుండి వాతావరణం భీభత్సంగా మారింది, గాలి చాలా వేగంగా వీచింది, చుట్టు ఉన్న పక్షులు అన్ని నేలకు రాలాయి. అది చూసిన ఆదిత్య, ప్రియలకు ఒక్క క్షణం ఎం జరుగుతుందో అర్ధంకాలేదు. ఆ మంత్రగతే తన తన శక్తి తో భూమిలో నుండి కొత్త మంది మనుషులని పుట్టించింది. అలాంటి వల్లనే ఆదిత్య ఆ ప్యాలస్ కి కాపలాగా చూసాడు . అలా పుట్టినా మాయావి లు ప్రియ మీద కత్తులతో  ధాడి చేయడం మొదలు పెట్టారు. ప్రియ ని కాపాడానికి ఆదిత్య పూరి చేయడం  కోసం వేడి చేసిన నూనే  ని వాళ్ళ మొహం మీద కొట్టి  . అక్కడి కి సరుకుల లోడ్  తో వచ్చిన ట్రక్ లో వాళ్ళు తప్పించుకున్నారు. ఆదిత్య ట్రక్ ని చాలా వేగంగా నడుపుతున్నాడు. వాళ్ళ వెనుక మాయావి లు అంతే వేగంగా పరిగెత్తుకుంటూ వస్తున్నారు, వాళ్ళ  వెనుక మంత్రగతే గాల్లో ఎగురుకుంటూ వస్తుంది. 
మంత్రగతే తన శక్తి తో  రోడ్ కి పక్కన ఉన్న బండలను, చెట్టుని దారికి అడంగ పడేసింది. దారికి అడంగ పడి ఉన్న రాళ్లను, చెట్టు ను చుసిన ఆదిత్య ట్రక్ ను రివర్స్ గేర్ లో  వెనుకకి వేగంగా పోనిచ్చాడు. దారిలో ఉన్న మాయావి లు తప్పించుకోవడానికి పక్కకు ఉన్న చెట్టు మీదకు దూకారు. గాలిలో ఉన్న మంత్రగతే ట్రక్ ని ఢీ  కొన్ని కింద పడిపోయింది. ఆదిత్య వెంటనే స్టీరింగ్ తిప్పి ట్రక్ ని ముందుకు పోనిచ్చాడు. 
మంత్రగతే వదిలిన ఆ మాయావి లు ఇంకా వదల్లేదు. ఆ మాయావిలు ఎలాగో లాగా ట్రక్ మీదకు దూకారు. వాళ్ళు ప్రియ పైన దాడి చేయడానికి ప్రయాణిస్తున్నారు. ఇంతలో ఒక్క మాయావి దారిలో ఓ పెద్ద కొమ్మ గట్టిగ తగలడం వల్ల భూడిదగా మారిపోయాడు. అది గమనించిన ఆదిత్య ట్రక్ ని చెట్టులు ఎక్కువగా ఉన్న అడవి మార్గం లో ట్రక్ ని పోనిచ్చాడు. మాయావి లు ఆ చెట్ల  కొమ్మాలకి తక్కి బూడిద అవ్వుతున్నారు. ట్రక్ వేగంగా వెళ్లడం వల్ల ట్రక్   కంట్రోల్ తప్పి ఒక్క పేద్ద చెట్టు ను గుద్దుకుంది అలా గుద్దుకోవడం వల్ల మిగిలిన మాయావిలు  అందరు భూడిదగా మారారు. 
చెట్టుకు గుద్దుకోవడం వల్ల ఆదిత్య కు  చిన్న  గాయాలు అయ్యాయి, ఒక్క మాయావి  తన ఆఖరి  క్షణం లో  ప్రియ ని కత్తి తో  కడుపు లో పొడిచాడు. ఆదిత్య ప్రియ కడుపు లో నుండి కారుతున్న రక్తాన్ని చూసాడు. అది చూసి ఆదిత్య చాలా కంగారుపడదు. ప్రియ కూడా తన  చేతులకి  అంటిన రక్తాన్ని చూసి కంగారు పడింది. కాని ఆ రక్తం పాపది  కాదు  తనది అన్ని తెలుసుకున్నాక తన మనసు కుదుటపడింది. ఆదిత్య తన భార్య ని ఎలాగైనా కాపాడుకోవాలని ఆ ట్రక్ దిగి తనని అక్కడ నుండి తీసుక వెళ్లే ప్రయత్నం చేసాడు. కాని ప్రియ నడిచే పరిస్థితిలో లేదు తాను అడుగు తీసి అడుగు వేయలేక పోతుంది. తాను ఎంత ప్రయత్నించినా తన వల్ల కావడం లేదు. రక్తం ఎక్కువగా పోతుందని  ఆదిత్య తన షర్ట్ తీసి ప్రియ నడుము కట్టాడు. అప్పుడే అటు  గా వస్తున్నా మంత్రగతేను చుసిన ప్రియ తన పాప ని చివరి సరిగా చూసుకొని ఆదిత్య కు పాప ని అప్పగించి అక్కడ నుండి వెళ్లిపొమ్మని చెప్పింది. ఆదిత్య ప్రియ ని కూడా తన తో రమన్ని చెప్పాడు. దానికి ససేమీరా ఒప్పుకోలేదు, తన వల్ల కాదని ఆదిత్య ను ఒపించి అక్కడనుండి పంపించింది. 
మంత్రగతే అక్కడికి చేరుకునే సరికి ట్రక్ పక్కన రక్తం తో తడిసిన ప్రియ ఒక్కతే ఉంది. మంత్రగతే ట్రక్ లో పాప గురుంచి వెతికింది అక్కడ లెక్కపోవడం తనని వెతుకుంటు వెళ్లబోతుంటే ప్రియ మంత్రగతే దారికి అడ్డం వచ్చింది. మంత్రగతే కోపం తో ప్రియ ని తన శక్తి తో గాల్లో కి లేపింది. ప్రియ భూమికి 10అడుగుల మీద ఉంది ప్రియ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది కాని తన వల్ల కావడం లేదు. మంత్రగతే అదే శక్తి తో ప్రియ గొంతు పిసుకుతుంది. ప్రియ దాన్ని వీడిపించుకోలేక పోతుంది అప్పుడే ఆదిత్య వెనుక నుండి వచ్చి మంత్రగతే తల మీద కర్ర తో గట్టిగ కొట్టాడు. మంత్రగతే తల పగిలి రక్తం కారుతుంది. మంత్రగతే ఆదిత్య ని చూస్తూ చిన్న నవ్వి ప్రియ మేడ పూర్తిగా వీరిచి కింద పడేసింది. అది  చుసిన ఆదిత్య భాధ తో గట్టిగ అరుస్తూ మారో సారి తల మీద గట్టిగ కొట్టాడు. మంత్రగతే అక్కడే పడిపోయింది. 
ఆదిత్య ఏడుస్తూ ప్రియ దగ్గరికి వెళ్ళాడు. ఆదిత్య ప్రియ తల ని ఒడిలో పెట్టుకొని. తన తో గడిపిన మధుర క్షణాలు గుర్తుచేసుకుంటూ  బొర్రుమని ఏడిచాడు. 
అప్పుడే ఆదిత్య కు ప్రియ ఎప్పుడు చెప్పే కోరిక ఒక్కటి తన  కళ్ల ముందు కదలాడింది. అదేంటంటే ప్రియ కి ఊటీ లో ఒక్క కొండ పైన పెద్ద ఇల్లు కట్టుకోవాలి, ఆ ఇంటి చుట్టూ పచ్చని చెట్లు, పక్షులు,  ప్రకృతి మాత్రమే ఉండాలి. అక్కడ చుట్టూ పక్కల వేరే ఇల్లు ఎం ఉండకూడదని . అక్కడ ఉండే చల్లని గాలిని, ప్రకృతి అందని ఆస్వాదిస్తూ ప్రశాంతంగా, హాయి గా,  భ్రాతకాలి అన్ని అంటుండేది. ఆదిత్య ప్రియ కోరిక మేరకు ఊటీ వెళ్ళాలి అన్ని నిశ్చయించుకొని  తన పాప ని తీసుకొని ఊటీ కి వెళ్ళిపోయాడు 

Wednesday, June 26, 2019

keerthi telugu story part-1

కీర్తి 
(పార్ట్-1 తన పాప ని కాపాడిన  ఆదిత్య )

ఒక అడవి లో బ్రిటిష్ కాలం నాటి పాత ప్యాలస్ ఉంది. ఒక రోజు రాత్రి  ఆ ప్యాలస్ కి దూరంగా ఒక కార్ వచ్చి ఆగింది. ఆ కార్ లోంచి ఆదిత్య దిగితు తన భార్య ప్రియ ని కార్ లో నే ఉండమని చెప్తాడు, తాను వచ్చేంత వరకు జాగర్తగా ఉండమని చెప్పి ప్యాలస్ వైపుగా వెళ్తాడు. ఆదిత్య మెల్లగా ఎవ్వరికి  తెలియకుండా ప్యాలస్ దగ్గరి కి చేరుకున్నాడు. ఆ ప్యాలస్ చుట్టూ వింత నాళ్ళని దుస్తులు ధరించినా మనుషులు ఉన్నారు. ఆదిత్య వాళ్ళెవ్వరి కంట  పడకుండా ప్యాలస్ వెనుక గేట్ వరకు చేరుకున్నాడు . అక్కడ నుండి మెల్లగా ప్యాలస్ లోపలికి వెళ్ళాడు. 
లోపలి కి వెళ్లిన ఆదిత్య  అక్కడ జరుగుతున్నది చూసి ఆశ్చర్య పొయ్యాడు అది బయటకి మాత్రమే ఓల్డ్ ప్యాలస్ లోపల మాత్రం మోడరన్ సైన్స్ ల్యాబ్ లా ఉంది. 
అక్కడ  ఎన్నో రూమ్స్  ఉన్నాయ్ ఇన్ని రూమ్స్ లో తన పాపా ని ఎలా వెతకాలి ఆందోళన పడ్డాడు. చిన్నగా ఒక్కో రూమ్ చూసుకుంటూ వెళ్తున్నాడు ఆలా వెళ్తున్న ఆదిత్య కి ఒక్క రూమ్ లో చిన్న పాపలను  పరిశోధన లో ఒక్క భాగంగా వాడటం చూసాడు. ఒక  పాప వొంట్లో ని రక్తం తో  ఏదో తయారు చేస్తున్నారని ఆదిత్య కి అర్ధమైంది. అట్టు పక్కన  కుప్పలుగా పడి ఉన్న చిన్న పిల్లల మృతదేహాలను చూసాడు. శరీరం నుండి  రక్తాన్ని పూర్తిగా తీసేసినట్టు ఉన్నారు చూడటానికి చాలా భయంకరంగా ఉన్నారు . అది చుసిన ఆదిత్య కు చాలా భయం వేసింది తన పాప కి ఎం కాకూడదు అన్ని దేవుని ప్రదించాడు. ఆలా వెతుకు వెతుకుతూ ఒక రూమ్ లో చిన్న పిల్లలని చూసాడు ఊయలలో హయ్యిగా నిద్రపోతున్నారు వీరిలో  తన పాపా ని ఎలా కనిపెట్టడం అన్ని ఆలోచిస్తున్నాడు. ఇంతలో ఆ ఊయలకు నోట్ప్యాడ్లు ఉండటం  చూసాడు దాన్ని మీద ఆ పాప పుట్టిన టైం, డేట్, ఇంకా ప్లేస్ ఉన్నాయ్ దాని ద్వారా తన పాప ని కనిపెట్టచ్చు అన్ని అనుకున్నాడు  . ఆ రూమ్లో  ఉన్న ప్రతి ఒక్క ఊయల ని చూసాడు కాని ఎక్కడ తన పాప లేదు దానితో ఆదిత్య కు చాలా భయం వేసింది తన పాప కి ఏమయిందో అన్ని గుప్పెడు దుఃఖం లో మునిగిపోయాడు ఆదిత్య . ఇంతలో ఆ గది ని ఆనుకొని ఉన్న ఒక చిన్న గదిలో నుంచి ఒక చిన్న పాప ఏడుపు శబ్దం వినిపించింది. అది విన్న ఆదిత్య కు అది తన పాప ఏడుపు అయిఉండచు అన్ని ఆశ గా ఆ రూమ్ లో కి వెళ్తాడు. ఆ రూమ్ లో కేవలం ఒక పాప మాత్రమే ఉంది, ఇది తన పాపే అయ్యిఉండాలని  ఆ దేవుడిని ప్రదిస్తూ ఆ ఊయల కి ఉన్న నోట్ప్యాడ్ ని చూసాడు. ఆ పాప  తన పాపే, తన గురుంచే ఆదిత్య వెతుకుంటూ వచ్చింది.  అదే మొద్దటి సరి ఆదిత్య తన పాప ని చూడటం . తన పాప ని చేతులోకి తీసుకున్న మరు క్షణం ఆదిత్య కళ్ళలో  ఆనందం తో నీళ్లు నిండాయి . 
ఇంకా  ఎక్కువ సేపు ఇక్కడ ఉంటె ప్రమాదం  అన్ని అనుకోని, ఆదిత్య  తాను ఎలా ఐతే లోపలికి  వచ్చాడో, అదే దారిలో  ఎవ్వరికి తెలియకుండా తన పాప తీసుకొని వెళ్ళిపోయాడు. 
ఆదిత్య మెల్లగా పాప ని తీసుకొని ప్రియ ఉన్న చోటుకు చేరుకున్నాడు. ఆదిత్య పాప ని ప్రియ కి అప్పగించి  కారులో వాళ్ళ ఇద్దరిని అక్కడ నుంచి దూరంగా తీసుకువెళ్లాడు. 
ఆలా వాళ్ళు, ఆ అడవిలోంచి బయటపడరు.
 దారిలో  వాళ్ళని  ఎవ్వరు ఫాలో  చేయట్లేదని కంఫర్మ్ చేసుకున్నాక  ఆదిత్య మనసు కుదుటపడింది. ఆదిత్య ప్రియా కళ్ళలో పాప దొరికిందన్న ఆనందాన్ని చూస్తాడు. పాప కి ఎ పేరు పెడదాం అన్ని అడుగుతాడు దానికి ప్రియ కీర్తి అన్ని చెపుతుంది. ఆదిత్య కూడా పేరు బాగుందాన్ని అంటదు. 

Keerthi Telugu story part 1.5

కీర్తి   (పార్ట్-1.5 వీరేంద్ర  )    వీరేంద్ర ది గ్రేట్ genetic scientist, genetic శాస్త్రం లో అతని  అంత గొప్ప వాడు లేడు. దాదాపు 3...